: ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అయిన కేసీఆర్
రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక అధికారులతో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాదులోని నాస్ డాక్ లో వీరి సమావేశం జరుగుతోంది. రానున్న రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై వీరు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో టీఎస్ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమై, బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. ఏ శాఖకు ఎంత మేర నిధులు కేటాయించాలనే విషయంపై కూడా చర్చ జరిగింది. దీనికి తుదిరూపునిచ్చే పనిలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. మార్చి 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.