: ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి టీడీపీ, బీజేపీలే కారణం: వైఎస్సార్సీపీ


ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైఎస్సార్సీపీ మండిపడింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం నిరాశను కలిగించిందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న అంశం విభజన చట్టంలో ఉన్నప్పటికీ, బడ్జెట్లో దాని ఊసే లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం టీడీపీ, బీజేపీలే అని ఆరోపించారు. అయితే, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. మరోవైపు, ఈ బడ్జెట్ వల్ల రైతులకు అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. పేదరిక నిర్మూలన కోసం కూడా ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News