: మళ్లీ తుపాకీ పడతా: రేవంత్


తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆవేశం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నేతలు టీడీపీ నేతలను కుక్కలతో పోల్చడంపై మండిపడ్డారు. ప్రజల కోసం పోరు సాగించే క్రమంలో శునక విశ్వాసం ప్రదర్శిస్తామని అన్నారు. మళ్లీ తుపాకీ పట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. 2011లో కరీంనగర్ లో జరిగిన రణభేరి సభకు రేవంత్ తుపాకీ వెంటబెట్టుకుని వెళ్లడం కలకలం రేపింది. ఉస్మానియా విద్యార్థులపై తుపాకీ గురిపెట్టాడని కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. తాజాగా, రేవంత్ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీ కార్యకర్తలను కాపాడుకునేందుకు అవసరమైతే మరోసారి తుపాకీ పడతానని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతోనే కేటీఆర్ గెలిచారని, ఇప్పుడు టీడీపీని ఖాళీ చేస్తామని వ్యాఖ్యానించడం సబబు కాదని రేవంత్ అన్నారు.

  • Loading...

More Telugu News