: షూటింగ్ లో గాయపడ్డ అందాలభామ నీతూచంద్ర


అందాల నటి నీతూచంద్ర సినిమా షూటింగ్ జరుగుతుండగా గాయపడింది. తమిళ సినిమా 'వైగై ఎక్స్ ప్రెస్' షూటింగులో ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా, ఆమె గాయపడిందట. చేతులు పలుచోట్ల కొట్టుకుపోయాయని, కన్ను వాచిందని సినీ యూనిట్ సభ్యులు తెలిపారు. నీతూ గాయపడటంతో వెంటనే షూటింగ్ ఆపేశారు. తీవ్ర నొప్పితో బాధ పడుతున్న నీతూని పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'గోదావరి' సినిమాలో నీతూచంద్ర నటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News