: అమెరికాతో యుద్ధానికి సిద్ధంకండి... సైన్యానికి ఉత్తర కొరియా ఆదేశాలు


అమెరికా, దాని మిత్రపక్ష దేశాలతో యుద్ధానికి సిద్ధం కావాలని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ప్రత్యర్థి దక్షిణ కొరియాతో కలసి అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు చేయడంతో, కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది. సుమారు 10 యుద్ధ విమానాలు, విమాన విధ్వంసక క్షిపణులను ఈ విన్యాసాల్లో భాగంగా ప్రదర్శించడంతో కిమ్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. అన్ని సైనిక విభాగాలు పూర్తి స్థాయిలో యుద్ధ సన్నాహకాలు చేయాలని ఆయన ఆదేశించినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News