: ధరలు పెరిగేవి, తగ్గేవి!
అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత పలు రకాల వస్తు ఉత్పత్తుల ధరల్లో మార్పు రానుంది. ప్రధానంగా ధరలు పెరిగే ఉత్పత్తులలో, సిగరెట్లు, బీడీలు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు, దిగుమతి చేసుకునే ఖరీదైన కార్లు, హై ఎండ్ మొబైల్ ఫోన్లు, భారీ సైజులో ఉండే టీవీలు, పర్ఫ్యూములు తదితరాలు వున్నాయి. 22 రకాల వస్తువులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించడంతో, వీటి ధరలు దిగిరానున్నాయి. ధర తగ్గనున్న ఉత్పత్తులలో వంట సామాగ్రి, తక్కువ ధర స్మార్ట్ ఫోన్ లు, సబ్బులు, ఆభరణాలు, బెల్టులు, షూస్ వంటి లెదర్ ఉత్పత్తులు, రెడీ మేడ్ దుస్తులు తదితరాలు వున్నాయి.