: కేంద్ర బడ్జెట్ పూర్తి వివరాలు - పార్ట్ 3


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని ప్రధానాంశాలు. * మొత్తం బడ్జెట్ రూ. 17,77,477 కోట్లు * ప్రణాళికా వ్యయం రూ. 4.65,277 లక్షల కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 13,12,200 కోట్లు * రక్షణ రంగానికి రూ. 2,46,726 కోట్లు * ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లలో ఐఐఎం ఏర్పాటు * డిజిటల్ ఇండియాలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ * ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సాయం * హైదరాబాద్ లోని కులీకుతుబ్ షాహీ టూంబ్స్ రక్షణకు నిధులు * సోలార్, ఎలక్ట్రికల్ వాహనాలకు రూ. 70 కోట్ల ప్రోత్సాహకం * శిశు సంరక్షణకు రూ. 300 కోట్లు * చైల్డ్ డెవలప్ మెంట్ పథకానికి రూ. 1500 కోట్లు * వచ్చే ఏడాది కూడంకుళంలో రెండో అణు విద్యుత్ ప్రాజెక్ట్ * ఏడాదికి రూ. 12 ప్రీమియంతో రూ. 2 లక్షల ఆరోగ్య బీమా * ఏడాదికి రూ. 330 ప్రీమియంతో జీవిత బీమా * ఉపాధి హామీ పథకానికి రూ. 34,699 కోట్లు * నాబార్డ్ కు రూ. 25 కోట్ల కేటాయింపు * యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ ఏర్పాటుకు కృషి * గోల్డ్ లోన్ స్థానంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ * ఆన్ లైన్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తాం * ట్యాక్స్ ఫ్రీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బాండ్లు * ఎస్సీ సంక్షేమ పథకాల కోసం రూ. 30 వేల కోట్లు * స్టార్టప్ కంపెనీల కోసం రూ. 1000 కోట్లతో ప్రత్యేక నిధి * స్వయం ఉపాధి కార్యక్రమాలకు రూ. 1000 కోట్లు * ఐటీ హబ్ ఏర్పాటుకు రూ. 150 కోట్లు * నిర్భయ ఫండ్ కు రూ. 1000 కోట్లు * వీసా ఆన్ అరైవల్ స్కీం కిందకు 150 దేశాలు * అశోకచక్ర ముద్రతో గోల్డ్ కాయిన్లు * ఉన్నత విద్య కోసం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం * విద్యా రంగానికి రూ. 68,960 కోట్ల కేటాయింపు * మహిళా, శిశు సంక్షేమానికి రూ. 10,513 కోట్లు * వైద్యానికి రూ. 3,31,500 కోట్లు

  • Loading...

More Telugu News