: పుట్టినరోజునాడు విద్యార్థినికి శిక్ష... బొట్టు పెట్టుకుందని రెండు గంటలు నిలబెట్టిన సెయింట్ ఆన్స్ హెచ్‌ఎం


బొట్టు పెట్టుకొని పాఠశాలకు వెళ్ళినందుకు పుట్టిన రోజునాడు ఆ చిన్నారికి పెద్ద శిక్షే పడింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని తార్నాక వైట్ హౌస్ వద్ద గల సెయింట్ ఆన్స్ హై స్కూల్‌ లో జరుగగా, ఏప్రిల్ 9లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ డీఈఓకు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాదుకు చెందిన వీరాచారి కూతుళ్లు వైష్ణవి, భవ్య మాధురిలు సెయింట్ ఆన్స్ హై స్కూల్‌ లో చదువుతున్నారు. భవ్య తన పుట్టినరోజు నాడు ఉదయం గుడికి వెళ్లి బొట్టు పెట్టుకుని పాఠశాలకు వెళ్ళింది. దీన్ని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సల్లీ జోసఫ్ ఆమెను పిలిచి తన ఛాంబర్ ముందు రెండు గంటలకు పైగా నిలబెట్టింది. భవ్య తల్లి నాగలక్ష్మిని పిలిపించి, టీసీ ఇచ్చి పంపేస్తామని బెదిరించింది. దీంతో ఆమె కన్నీళ్ళతో భర్తకు ఫోన్ చేయగా, ఆయన మాటలనూ సల్లీ జోసఫ్ పట్టించుకోలేదు. హిందూ ధర్మం ప్రకారం ఆలయానికి వెళ్లి పూజలు చేయడం సాంప్రదాయమని హెచ్‌ఎంకు చెప్పినా వినిపించుకోలేదు. ఈ మొత్తం ఘటనపై వీరాచారి ఫిర్యాదుపై హెచ్‌ఆర్సీ స్పందించింది.

  • Loading...

More Telugu News