: బెదిరింపులకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి... టీఆర్ఎస్ ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన తాను బాధ్యత గల ప్రజాప్రతినిధి అన్న విషయాన్ని మరిచిపోయి, తమ పార్టీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఈ మేరకు వారు పెద్దపల్లి స్టేషనులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించారని, ఆయనతో పాటు ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.