: మోదీ, బాబులవి రైతు వ్యతిరేక విధానాలే: స్వామి అగ్నివేశ్


ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరూ ఇద్దరేనని సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ పేర్కొన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ప్రధాని, ఏపీ సీఎం ఇద్దరూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. రైతుల భూములు లాక్కుని, వారి పొట్టకొట్టి పారిశ్రామికవేత్తలకు పందేరం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధి పేరిట వారిద్దరూ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం రియల్టర్ గా మారిపోయారని, రాజధాని నిర్మాణం ముసుగులో బడాబాబులకు భూములు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వచ్చే నెలలో ఏపీ రాజధాని ప్రాంతంలో అన్నా హజారే, మేధా పాట్కర్ పర్యటించనున్నారని ఆయన తెలిపారు. కేంద్రంలో అధికార పక్షం తీరుతోనే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వచ్చాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News