: విలేకరి హత్య కేసులో మంత్రి అనుచరుడి అరెస్టు


గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మూడు నెలల క్రితం విలేకరి శంకర్ హత్యకు గురికాగా, తాజాగా, ఆ కేసులో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు వెంగళ్రాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. చిలకలూరిపేట ఆంధ్రప్రభ విలేకరి శంకర్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా, హత్యకు సూత్రధారిగా వెంగళ్రాయుడుపై ఆరోపణలున్నాయి. వెంగళ్రాయుడు పోలీస్ స్టేషన్ లోనే పంచాయతీలు చేశాడంటూ శంకర్ గతంలో వార్తలు ప్రచురించాడు. దీనిని మనసులో పెట్టుకున్న వెంగళ్రాయుడు, విధులు ముగించి ఇంటికి వెళ్తున్న శంకర్ ను అడ్డుకుని హత్య చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా వెంగళ్రాయుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News