: ఇకపై ఆన్ లైన్ ఓటింగ్... ఎన్నికల సంఘం సన్నాహాలు


భవిష్యత్ లో ఓటింగ్ ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆన్ లైన్ ఓటింగ్ లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సాఫ్ట్ వేర్ రూపకల్పన చేస్తున్నామని అన్నారు. అందుకోసం తమకు మరిన్ని నిధులు అవసరమవుతాయని ఆయన చెప్పారు. ఇది వినియోగంలోకి వస్తే సమయం, శ్రమ, ధనం అన్నీ ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానం చేయడం ద్వారా ఓటింగ్ లో అవకతవకలకు తావులేకుండా చేయవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News