: నేనంటే మోదీకి మంట: అన్నా హజారే
ప్రధాని నరేంద్ర మోదీకి నేనంటే మంట అని సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర గ్రామంలో ఆయన మాట్లాడుతూ, భూసేకరణ బిల్లుపై తానిచ్చే సలహాలను ప్రధాని అంగీకరించరని అన్నారు. బలవంతపు భూసేకరణకు ప్రభుత్వాలు మొగ్గుచూపుతాయని ఆయన తెలిపారు. అందుకే ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నానని ఆయన చెప్పారు. మోదీ, రాహుల్ గాంధీల నెత్తిన పారిశ్రామిక వేత్తలు తిష్టవేసుకుని కూర్చున్నారని, దేశ ప్రజలకు న్యాయం చేయలేరని ఎన్నికలప్పుడే హెచ్చరించానని ఆయన గుర్తు చేశారు. అందుకే భూసేకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రతి గ్రామాన 8 మందితో ఓ కమిటీ వేస్తామని, ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసుకుని, ఉద్ధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.