: కేబినెట్ లో చేరాలనే కవిత మోదీ భజన చేస్తున్నారు: షబ్బీర్ అలీ
టీఆర్ఎస్ ఎంపీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ లో చేరాలన్న ప్రణాళికతోనే ఆమె నిత్యం ప్రధానమంత్రి నరేంద్రమోదీ భజన చేస్తున్నారన్నారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, ఏపీతో పోలిస్తే ప్రస్తుత రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు కొంతమేర న్యాయమే జరిగిందన్న కవిత... ఆ లబ్ధి ఏంటో చెప్పాలన్నారు. అసలు బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఎంపీలు విఫలమయ్యారని అన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని షబ్బీర్ డిమాండ్ చేశారు.