: చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలన కొనసాగడం లేదని, కేవలం రాజకీయ వ్యాపారమే సాగుతోందని మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. జపాన్, సింగపూర్ లకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరెవరితో మాట్లాడారో పరిశీలిస్తే, అసలైన నిజాలు బయటకు వస్తాయని, అప్పుడు ఆయన జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు గతంలోనే వచ్చాయని, వాటిపై విచారణ జరగకుండా ఆయన స్టే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ రాజధాని నిర్మాణంలో ఏమాత్రం పారదర్శకత లేదని విమర్శించారు. చంద్రబాబుపై విచారణ చేపట్టాలని... అప్పుడు ఆయన చేసిన దందాలు, వ్యాపారాలన్నీ బయటకు వస్తాయని అన్నారు.