: బియ్యం కోటా పెంచండి: కేంద్రాన్ని కోరిన మంత్రి ఈటెల


తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోటాను పెంచాలని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. ఈ రోజు ఆయన కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా, తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలపై వీరు ఇరువురూ చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని, ఈ పథకంతో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతోందని... అందువల్ల ఈ పథకానికి మరింత ఆసరా కలిగేలా బియ్యం కోటాను పెంచాలని ఈటెల కోరారు.

  • Loading...

More Telugu News