: కుమారుడి నిశ్చితార్థానికి కేసీఆర్ ను ఆహ్వానించిన మోహన్ బాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈరోజు నటుడు మోహన్ బాబు కలిశారు. తన చిన్న కుమారుడు, హీరో మనోజ్ నిశ్చితార్థానికి ఆయనను ఆహ్వానించారు. తమ కుటుంబ సన్నిహితురాలైన ప్రణీత రెడ్డితో మనోజ్ వివాహం జరగనుందని కొన్ని రోజుల కిందటే మోహన్ బాబు స్వయంగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో మార్చి 2న వారి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.