: దక్షిణాఫ్రికా అంత స్కోర్ కొట్టినా, రికార్డు మాత్రం మనదే
సిడ్నీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో డివిలియర్స్ విరుచుకుపడి, 66 బంతుల్లో 162 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 408 పరుగులకు చేర్చినా, వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల రికార్డును మాత్రం చెరపలేక పోయాడు. ఇప్పటికీ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల రికార్డు భారత్ పేరిటే ఉంది. 2007లో జరిగిన పోటీల్లో బెర్ముడాపై 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 413 పరుగులను ఇండియా సాధించింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ రికార్డు పదిలంగానే ఉంది. నేటి మ్యాచ్ లో మరో రెండు బాల్స్ డివిలియర్స్ ఆడి వుంటే దక్షిణాఫ్రికా స్కోర్ 413 పరుగులు దాటేదేమో! కాగా, వరల్డ్ కప్ పోటీలలో అత్యధిక విన్నింగ్ మార్జిన్ (257 పరుగులు, బెర్ముడాపై) కూడా ఇండియా పేరిటే ఉంది.