: నిప్పంటుకొని ఆహుతైన "ఏబీసీడీ-2" సెట్
ఓ హిందీ చిత్రం కోసం వేసిన డాన్స్ ఫ్లోర్ సెట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన ముంబైలో జరిగింది. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా నటిస్తున్న 'ఎనీ బడీ కెన్ డాన్స్-2' (ఏబీసీడీ-2) చిత్రం సెట్లో సుమారు 600 మంది ఆర్టిస్టులతో పాటను చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. మంటలను ఆర్పివేశామని, నేటి నుంచి షూటింగ్ కొనసాగుతుందని వరుణ్ ధావన్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయాలని దర్శకుడు రెమో డిసౌజా భావిస్తున్నారు.