: అమెజాన్.కామ్ లో చేరుతున్న ఒబామా మాజీ ప్రతినిధి జే కార్నె
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతినిధిగా వ్యవహరించిన జే కార్నెను అమెజాన్.కామ్... సంస్థ ప్రపంచవ్యాప్త కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించుకుంది. గతేడాది జూన్ లో కార్నె ఒబామా పత్రికా కార్యదర్శి పదవి నుంచి వైదొలగారు. ఆ తరువాత నుంచి సీఎన్ఎన్ లో పొలిటికల్ కామెంటేటర్ గా పనిచేస్తున్నారు. తాజాగా అమెజాన్ సంస్థలో చేరుతున్నారు. ఈ క్రమంలో సంస్థ ఇంటర్నెట్ రిటైలర్ల ప్రజా సంబంధాలు, లాబీయింగ్ ప్రయత్నాలను పర్యవేక్షించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్ కు ఓ నివేదిక ఇస్తారు.