: నలుగురికి హ్యాండిచ్చి ఐదో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లికూతురు!


2010లో చెన్నై, టి.నగర్‌కు చెందిన నరసింహారావు, 2012లో తిరుచ్చిలో రవికుమార్‌, 2013లో చెన్నై మాంబళంకు చెందిన రాజగోపాల్‌... ఇలా ఓ మాయలేడికి డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవడం, అందినకాడికి దోచుకొని ఉడాయించడమే పని. లేటెస్ట్ గా, మొగపేర్ ఈస్ట్ టీవీఎస్ అవెన్యూకు చెందిన శ్రీనివాసన్ (38)ను వివాహమాడింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి సెల్ ఫోన్ లోని నంబర్లు సేకరించి పోలీసులను సంప్రదించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీనివాసన్ తో కాపురం చేస్తూనే, ఈ 'కిలేడి' అంబత్తూరుకు చెందిన బాలాజీతో వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అంతకుముందు ఒక వెబ్ సైట్‌ లోని పెళ్లి ప్రకటనలో ఉన్న వివరాల మేరకు కోయంబత్తూరుకు చెందిన గాయత్రికి శ్రీనివాసన్ ఫోన్ కొట్టాడు. తాను బీఎస్సీ చదువుకున్నట్టు, తన ఇష్టాయిష్టాలను గాయత్రి చెప్పడం శ్రీనివాసన్‌ కు నచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మత్తుగా మాటలు చెప్పడం, కొంతకాలం వుండి, అందినంత దోచుకొని వెళ్ళడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. విచారణలో ఈ మాయ లేడి బండారం అంతా వెలుగులోకి రాగా, కేవలం డబ్బు, ఆభరణాల మీదున్న మోజుతో భర్తల్ని మార్చేసినట్లు తేలింది.

  • Loading...

More Telugu News