: అణు రియాక్టరును ఆన్ చేసిన పాకిస్థాన్


అణ్వాయుధాలలో విరివిగా వాడే ప్లూటోనియంను తయారు చేయగల రియాక్టరును పాకిస్తాన్ వినియోగంలోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. కుషబ్ ప్రాంతంలో పాక్ 4వ రియాక్టరును ఆన్ చేసిన విషయం భారత ప్రభుత్వానికి తెలుసునని వివరించారు. అయితే, భారత ప్రయోజనాలు కాపాడే విషయంలో ఒక్క అడుగు కూడా వెనుకంజ వేయబోమని, దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ కు జనవరి 2015 వరకూ రూ.580 కోట్ల రూపాయల సాయం చేసినట్టు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

  • Loading...

More Telugu News