: పార్లమెంటుకు చేరుకున్న సురేశ్ ప్రభు... మరికొద్దిసేపట్లో రైల్వే బడ్జెట్


కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. మోదీ సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మంత్రి సురేశ్ ప్రభు భారీ కసరత్తే చేశారు. ఇటీవలే మోదీ సర్కారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు రైల్వే బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఆశించిన మేర సమయం లభించని సంగతి తెలిసిందే. అయినా ఉన్నంత సమయంలోనే రాత్రింబవళ్లు శ్రమించిన సురేశ్ ప్రభు, మోదీ ఆశయాలకనుగుణమైన బడ్జెట్ ను రూపొందించడంలో దాదాపు కృతకృత్యులయ్యారనే చెప్పాలి. ఈ దఫా బడ్జెట్ లో ఛార్జీల పెంపు ఉండదని ఇప్పటికే సంకేతాలిచ్చిన మంత్రి, మరి ఏ తరహా అంశాలను ప్రస్తావించనున్నారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది.

  • Loading...

More Telugu News