: నాలుగు రోజుల టెస్టులు, 40 ఓవర్ల వరల్డ్ కప్... ఈసీబీ కొత్త ప్రతిపాదనలు
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. క్రికెట్ ను మరింత జనరంజకంగా మార్చేందుకు టెస్టు మ్యాచ్ లను నాలుగు రోజులకు కుదించాలని, వన్డే వరల్డ్ కప్ లో 40 ఓవర్ల మ్యాచ్ లే ఉండాలని పేర్కొంది. ఐసీసీ గనుకు ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే ఇక వచ్చే వరల్డ్ కప్ లో 40 ఓవర్ల మ్యాచ్ లు జరుగుతాయి. టెస్టు క్రికెట్ కూడా కొత్త రూపు సంతరించుకుంటుంది. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ కు మరింత ఊపునిచ్చేందుకు ఈ మార్పులు ఉపకరిస్తాయని ఈసీబీ భావిస్తోంది.