: ప్రేమజంటపై కత్తులు దూశారు... యువకుడు మృతి, యువతి పరిస్థితి విషమం!
గుంటూరు జిల్లా కోటప్పకొండలో ఓ ప్రేమజంటపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడిచేశారు. దుండగుల దాడిలో యువకుడు ప్రాణాలు విడిచాడు. యువతికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడిని మాచర్ల మండలం శ్రీరాంపురం తండాకు చెందిన అంజీనాయక్ గా గుర్తించారు. యువతి స్వస్థలం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం. చిలకలూరిపేటలోని ఓ కాలేజీలో ఆమె డిప్లొమో చదువుతోంది. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమజంట కోటప్పకొండలో స్వామివారిని దర్శించుకుని వస్తుండగా మెట్లమార్గం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.