: అమితాబ్ కు అమెరికా ఫెడరల్ కోర్టు సమన్లు
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఫెడరల్ కోర్టు సమన్లు జారీ చేసింది. మానవ హక్కులు ఉల్లంఘించిన కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి. వాటికి సంబంధించిన కాపీని హాలీవుడ్ లోని బిగ్ బి మేనేజర్ డేవిడ్ అందుకున్నారు. నవంబర్, 1984లో సిక్కులపై హింసకు అమితాబ్ ప్రేరేపించారని ఆరోపిస్తూ న్యూయార్క్ లోని సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు దేశ నాయకులపై ఈ సంస్థ ఇదే తరహా కేసులు పెట్టిన సంగతి తెలిసిందే.