: భవిష్యత్తు భూకంపాలకు హెచ్చరికే ఈ ప్రకంపనలు... అప్రమత్తమైన అధికారులు, సర్వేకు ఆదేశం
ఇప్పటిదాకా తెలుగు నేలలో భూకంపాలు లేవు. అయితే భవిష్యత్తులో జరగవని మాత్రం చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే, నేటి ఉదయం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చోటుచేసుకున్న భూప్రకంపనలు, భవిష్యత్తులో సంభవించబోయే పెను భూకంపాలకు హెచ్చరిక లాంటివేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. భూప్రకంపనలు నమోదైన మండలాల్లో పర్యటించి, వాస్తవ పరిస్థితిపై వివరాలు సేకరించాలని ప్రకాశం జిల్లా ఇంచార్జి కలెక్టర్ హరి జవహర్ లాల్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు భూకంపం సంభవించిన ప్రాంతాల్లో పర్యటించాలని ఎన్జీఆర్ఐ అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉంటే, తాజా భూప్రకంపనల కేంద్రం చిలకలూరిపేటకు 32 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు