: సిరియాలో 90 మంది క్రైస్తవులను అపహరించిన ఐఎస్ఐఎస్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో దుశ్చర్యకు పాల్పడింది. సిరియా ఈశాన్య ప్రాంతంలో కనీసం 90 మంది క్రైస్తవులను మంగళవారం కిడ్నాప్ చేసినట్టు సమాచారం. కుర్దు బలగాల నుంచి రెండు గ్రామాలను ఐఎస్ మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఈ అపహరణలు చోటుచేసుకున్నట్టు మానవ హక్కుల సంఘం సిరియా విభాగం పేర్కొంది. తల్ షమిరామ్, తల్ హెర్ముజ్ గ్రామాలకు చెందిన ప్రజలు ఐఎస్ బారిన పడ్డట్టు మానవ హక్కుల పరిశీలకుడు వివరించారు. సిరియాలోని క్రైస్తవులపై ఐఎస్ కొన్నాళ్లుగా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోంది.