: ఉక్రెయిన్ తో యుద్ధం జరిగే అవకాశం ఉంది: పుతిన్
పొరుగు దేశం ఉక్రెయిన్ తో యుద్ధం జరిగే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. రష్యా స్టేట్ టీవీకి చెందిన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా పుతిన్ ఈ సమాధానం ఇచ్చారు. యుద్ధం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, అలా ఎన్నటికీ జరగకూడదనే కోరుకుంటానని చెప్పారు. తూర్పు ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్ లతో మరోసారి చర్చించే అవకాశం ఉండదని మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఈ ఇంటర్వ్యూను క్రెమ్లిన్ వెబ్ సైట్ లో కూడా ఉంచారు.