: విండీస్ జట్టుకు మరో విజయం


వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ లో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్ మ్యాచ్ లో జింబాబ్వేను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 372 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (215), మార్లోన్ శామ్యూల్స్ (133) పరుగులు వెల్లువెత్తించారు. అనంతరం, 373 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వేను వరుణుడు అడ్డుకున్నాడు. దీంతో, డక్ వర్త్ లూయిస్ విధానం అనుసరించి ఆ జట్టు విజయలక్ష్యాన్ని 48 ఓవర్లలో 363 పరుగులకు కుదించారు. అయితే, జింబాబ్వే 44.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. విలియమ్స్ 76, ఇర్విన్ 52, బ్రెండన్ టేలర్ 37 పరుగులు చేశారు. కరీబియన్ బౌలర్లలో హోల్డర్, జెరోమ్ టేలర్ చెరో 3 వికెట్లు తీయగా, గేల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. డబుల్ సెంచరీ సాధించిన గేల్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందజేశారు. గ్రూప్ దశ తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో కంగుతిన్న వెస్టిండీస్ జట్టు ఆ తర్వాత పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించడం విదితమే.

  • Loading...

More Telugu News