: ఆకాశం నుంచి కరెన్సీ నోట్ల వర్షం!


ఆకాశం నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. విమానంలో నుంచి పడ్డాయో లేక మరేమైనా జరిగిందో తెలియదుగానీ, దుబాయ్ లోని జుమీరా ప్రాంతంలో ఏకంగా 500 దినార్ల విలువైన కొన్ని వేల నోట్లు గాల్లో ఎగురుతూ వచ్చాయి. ఇది చూసిన ప్రజలు, కార్లు, బస్సుల్లో వెళ్తున్న వారు ఆ నోట్లను ఏరుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ మొత్తం భారత కరెన్సీలో రూ.4.81 కోట్లు ఉంటుందని అంచనా. నోట్ల వర్షం కురిసిన సమయంలో ఈదురు గాలులు బలంగా వీచాయని సమాచారం. ఈ ఘటన చూసిన అత్యధికులు నోట్లను ఏరుకోవడంలో నిమగ్నంకాగా, కొంత మంది ఆ దశ్యాలను తమ సెల్‌ ఫోన్లలో బంధించారు. ఆకాశం నుంచి కరెన్సీ కురిసినట్టు స్పష్టం చేసిన అధికారులు, అవి ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయో వెల్లడించలేకపోతున్నారు.

  • Loading...

More Telugu News