: బంతితో రాణించిన విండీస్ కెప్టెన్... కష్టాల్లో జింబాబ్వే


జింబాబ్వేతో మ్యాచ్ లో విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బంతితో రాణించాడు. భారీ లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వేను హోల్డర్ ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఓపెనర్లు సికిందర్ రజా (26), చకాబ్వా (2)లను ఈ పొడగరి పేసర్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన స్టార్ బ్యాట్స్ మన్ హామిల్టన్ మసకద్జా 5 పరుగులు చేసి అవుటయ్యాడు. టేలర్ (37) రాణించినా భారీ స్కోరు నమోదు చేయలేకపోయాడు. అనంతరం వచ్చిన విలియమ్స్ క్రీజులో పాతుకుపోయాడు. 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు వెనుదిరగడంతో జింబాబ్వే కష్టాల్లో పడింది. ఈ వికెట్ కూడా హోల్డర్ ఖాతాలోకే చేరింది. 28 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే స్కోరు 5 వికెట్లకు 177 పరుగులు కాగా, క్రీజులో ఇర్విన్ (17 బ్యాటింగ్), మత్సికెన్యెరి (0 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు, వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 372 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News