: 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన జైట్లీ


14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో... పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాకుండా, మరో 4 నుంచి 5 శాతం వాటాను స్థానిక సంస్థల ద్వారా ఇవ్వాలని ఆర్థిక సంఘం పేర్కొంది. మరోవైపు, భూ సేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్ సభలో విపక్షాలు నిరసన తెలుపుతూ, సభ నుంచి వాకౌట్ చేశాయి.

  • Loading...

More Telugu News