: లీకు వీరుల భరతం పడుతున్న పోలీసులు... విచారణలో కీలక సమాచారం వెల్లడి!


వివిధ మంత్రిత్వ కార్యాలయాల నుంచి కీలక పత్రాలను బయటకు చేరవేసిన కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. తాజాగా, భారత రక్షణశాఖకు సంబంధించిన రహస్య పత్రాల లీకేజీ వ్యవహారం కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వీరేందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను రక్షణశాఖలో స్టాఫ్ వర్కర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. వీరేందర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు ఆరుగంటలపాటు విచారించినట్టు సమాచారం. ఈ సందర్భంగా, కేసు లోతుల్లోకి వెళ్లేందుకు సహాయపడే సమాచారం లభించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News