: హైదరాబాదులో దారుణం... వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన దుండగులు
హైదరాబాద్ మహా నగరంలో దారుణం జరిగింది. ఈ ఉదయం ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సికింద్రాబాద్ లోని పాత గాంధీ ఆసుప్రతి సమీపంలో చందు అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పాత గొడవల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.