: నేడు సొంత నియోజకవర్గం కుప్పంకు చంద్రబాబు... రెండు రోజుల పాటు అక్కడే మకాం!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు. నేటి ఉదయం బెంగళూరు మీదుగా కుప్పం చేరుకునే చంద్రబాబు రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. నియోజకవర్గ పరిధిలోని కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం తదితర మండలాల్లో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. సీఎంగా పదవి చేపట్టిన తర్వాత కుప్పం వెళుతున్న చంద్రబాబు రెండు రోజుల పాటు సుదీర్ఘ పర్యటన చేస్తుండటం ఇదే తొలిసారి. ఆయన పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.