: బీసీసీఐ సమావేశానికి శ్రీనివాసన్ హాజరుపై సుప్రీం మండిపాటు


మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన సమావేశంలో పాల్గొనడాన్ని తప్పుబడుతూ శ్రీని తరపున హాజరైన న్యాయవాది కపిల్ సిబల్ ను కూడా మందలించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. ఏప్రిల్ 27న తమకు వివరణ తెలియజేయాలని తెలిపింది. ఈ నెల 8న చెన్నైలో బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. దాంతో బోర్డు ఆయనపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేసింది. సమావేశాలకు రాకుండా శ్రీనిని అడ్డుకోవాలని కోరడంతో విచారణ చేపట్టిన సుప్రీం పైవిధంగా స్పందించింది. బీసీసీఐకి దూరంగా ఉండాలంటూ జనవరిలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణ సమయంలోనే సుప్రీం స్పష్టం చేసిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News