: కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంలో మరో కేసు
దేశంలో తాజాగా సంచలనం సృష్టిస్తున్న కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బొగ్గు, విద్యుత్ శాఖల పత్రాలు లీకైన వ్యవహారంలో ఈ కేసు పెట్టగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సలహాదారును కూడా అదుపులోకి తీసుకున్నారు. అతను లోకేష్ అని, నోయిడాలోని ఇన్ ఫ్రా లైన్ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్నాడని సమాచారం. ఈ విషయాలన్నింటినీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్త కమిషనర్ రవీంద్ర యాదవ్ ధ్రువీకరించారు. మధాహ్నం అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. తొలుత పెట్రోలియం మంత్రిత్వ శాఖ పత్రాలు లీకైన వ్యవహారంలో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ప్రస్తుతం పత్రాలు లీకైన కేసులో దర్యాప్తు జరుగుతోంది.