: బీజేపీ కూడా అవినీతి పార్టీయే... కిరణ్ బేడీ అందులో చేరడం ప్రజలకు నచ్చలేదు: ప్రశాంత్ భూషణ్
ప్రముఖ న్యాయవాది, ఆప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. అన్ని రాజకీయ పార్టీలకంటే బీజేపీ గొప్పదేమీ కాదని... అది కూడా ఒక అవినీతిమయమైన పార్టీయేనని మండిపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కిరణ్ బేడీ... బీజేపీలో చేరడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారని ఆయన అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తమకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయని... ఇన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని ఊహించలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక్క శాఖను కూడా తన వద్ద ఉంచుకోకపోవడం ఆయన ఇష్టమని... బహుశా అన్ని శాఖలను పర్యవేక్షించాలనే ఆలోచనలో ఆయన ఉండవచ్చని తెలిపారు.