: రూ.3కే వంటగ్యాస్... డబుల్ డెక్కర్ ఫ్యాన్‌... 7వ తరగతి చదివిన ఎలక్ట్రీషియన్‌ సృష్టి


కేవలం మూడు రూపాయలకు గంటసేపు మండే ఇంధనం, తక్కువ విద్యుత్ వాడుతూ ఎక్కువ గాలిని అందించే డబుల్ డెక్కర్ విద్యుత్ ఫ్యాన్‌ లను తమిళనాడులోని మధురైలో ఎలక్ట్రీషియన్‌ గా పనిచేస్తున్న అబ్దుల్ రజాక్ (45) రూపొందించాడు. కేవలం 7వ తరగతి వరకూ మాత్రమే చదివిన రజాక్ తన ప్రతిభతో, రైల్వే పట్టాలపై పగుళ్లను కనుగొనే పరికరం, ఒకే సమయలో అన్నం, కూర తయారు చేసే కుక్కర్‌ సహా 37 రకాల పరికరాలను తయారుచేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ ఉత్పత్తుల పేటెంట్‌ లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. రంపపు పొట్టుతో అగరుబత్తిలకు ఉపయోగించే జిగురును చేర్చి కంప్రెస్ యంత్రం ద్వారా అదిమి, చెక్కపొట్టు ఇంధనపు కడ్డీని ఆయన రూపొందించారు. రూ.3 ఖర్చుతో తయారుచేసిన ఈ కడ్డీకి స్టవ్ బర్నర్ సెట్‌ ను జతచేసి గంటకు పైగా వంట చేసుకోవచ్చని తెలిపారు. సీలింగ్ ఫ్యానులో టేబుల్ ఫ్యాన్ రెక్కలను అమర్చి డబుల్ డెక్కర్ ఫ్యాన్‌ ను రజాక్ తయారుచేశారు. దీంతో విద్యుత్ ఖర్చు ఎక్కువయ్యే అవకాశం లేదని వివరించారు.

  • Loading...

More Telugu News