: ఫ్యాక్షన్ కప్పట్రాళ్లను దత్తత తీసుకున్న ఎస్పీ


ఫ్యాక్షన్ కు రాజధాని అని పేరుపడిన కప్పట్రాళ్ల గ్రామాన్ని ఎస్పీ రవికృష్ణ దత్తత తీసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్లలో ఫ్యాక్షన్ హత్యలు సర్వసాధారణమని అంతా భావిస్తారు. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్యతో ప్రారంభమైన ఫ్యాక్షన్ కలహాలతో పార్టీలు, వర్గాలుగా, వర్గాలు, కుటుంబాలుగా మారి ఒకరిపై కత్తులతో దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. అలాంటి కప్పట్రాళ్లను ఫ్యాక్షన్ లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని ఎస్పీ రవికృష్ణ పేర్కొన్నారు. కప్పట్రాళ్లలో ప్రశాంతత నెలకొనేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News