: టీమిండియాను అభినందించిన మోదీ, ప్రణబ్
టీమిండియాపై అభినందనల వర్షం కురుస్తోంది. కీలకమైనదిగా నిపుణులు పేర్కొన్న మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించడంతో, టీమిండియాపై భారత్ లోని అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత విజయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. 27 ఏళ్లుగా నిలిచి ఉన్న రికార్డును తుడిచేయడంపై రాష్ట్రపతి ప్రణబ్ హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని విజయాలు సాధించి దేశం గర్వపడేలా చేయాలని వారు టీమిండియా ఆటగాళ్లకు సూచించారు. టీమిండియా విజయం సాధించడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు పట్టణాల్లో బాణసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు.