: నేడు బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణస్వీకారం... హాజరుకానున్న పలువురు నేతలు
బీహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత నితీశ్ కుమార్ నేడు మరోసారి పాలనాపగ్గాలు చేపట్టనున్నారు. పాట్నాలో ఆయన ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని ఘనంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం పదవికి జీతన్ రాం మాంఝీ శుక్రవారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, నితీశ్ కుమార్ బీహార్ సీఎం పీఠం ఎక్కడం ఇది నాలుగోసారి. సాయంత్రం ఐదు గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ లతోపాటు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధ్యక్షుడు దేవెగౌడ తదితరులు హాజరుకానున్నారని సమాచారం.