: స్వైన్ ఫ్లూ మందుల కొరత లేదు...774 మంది మృతి చెందారు: వైద్యవర్గాలు


దేశంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య పెరుగుతోంది. గురువారం నాటికి దేశంలో నమోదైన స్వైన్ ఫ్లూ వివరాలను జాతీయ వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 774 మంది స్వైన్ ఫ్లూ వ్యాధికి బలయ్యారని వైద్యులు వెల్లడించారు. దేశంలో స్వైన్ ఫ్లూ చికిత్సకు సంబంధించి ఎలాంటి మందుల కొరత లేదని వారు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోంది. నేతలు, ప్రజలు అనే సంబంధం లేకుండా పలువురు స్వైన్ ఫ్లూ బాధితులుగా మారారు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ దీని ప్రభావం తగ్గుతుందని గతంలో వైద్యులు తెలిపిన సంగతి తెలిసిందే. ఉత్తరాదిలో ఇంకా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దీని ప్రభావం కనబడుతోంది.

  • Loading...

More Telugu News