: చిన్న పిట్టలను కాదు... పెద్ద పిట్టలను పట్టండి: కేజ్రివాల్
సంచలనం సృష్టించిన కార్పొరేట్ గూఢచర్యం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కోరారు. పోలీసులు అరెస్ట్ చేసిన చిన్న ఉద్యోగుల నుంచి సమాచార తస్కరణ వల్ల లబ్ధి పొందిన బడాబాబులను గుర్తించాలని ఆయన అన్నారు. ఈ కేసులో వేగంగా స్పందించి ప్రముఖ కంపెనీల పేర్లు బయటపెట్టిన పోలీసులను ఆయన అభినందించారు. చిన్న పిట్టలను విచారించి పెద్ద పిట్టలను పట్టుకొని చమురు మురికి వదిలించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో నిన్నటివరకూ 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నేడు మరింత మందిని అదుపులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.