: మోదీ సూటుకు రూ.5 కోట్ల బిడ్... సమయం ముగియడంతో తిరస్కరణ


ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బంద్ గలా సూటు నిన్నటితో ముగిసిన వేలంలో రూ.4.31 కోట్లకు అమ్ముడుబోయింది. సూరత్ లో జరిగిన వేలంలో ఆ నగరానికే చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీభాయ్ పటేల్ సదరు సూటును దక్కించుకున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు సాగిన వేలంలో మూడో రోజు భారీ ధరలను ఆపర్ చేస్తూ పలువురు వ్యక్తులు బిడ్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యాపారి మోదీ సూటు కోసం ఏకంగా రూ.5 కోట్లను ఆపర్ చేస్తూ బిడ్ దాఖలు చేశారు. అయితే అప్పటికే బిడ్ల దాఖలుకు నిర్దేశిత గడువు ముగిసింది. దీంతో గడువులోగా భారీ ధరను ఆఫర్ చేసిన లాల్జీభాయ్ పటేల్, మోదీ సూటును దక్కించుకున్నట్లు వేలం నిర్వాహకులు ప్రకటించారు. అంటే, మరింత సమయం పొడిగించి ఉంటే, మోదీ సూటుకు మరింత ఎక్కువ ధర వచ్చేదన్నమాట.

  • Loading...

More Telugu News