: కొల్హాపూర్ లో దాడికి గురైన టోల్ గేట్ల ఉద్యమకారుడు పన్సారే కన్నుమూత
టోల్ గేట్ల యాజమాన్యాల అక్రమాలపై గళమెత్తిన ఉద్యమకారుడు గోవిందరావు పన్సారే కన్నుమూశారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో ఈ నెల 16న ఆయనపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. నాటి దాడిలో తీవ్రంగా గాయాలపాలైన పన్సారేను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే నేటి ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. తమ అవినీతి భాగోతాలను బయటపెడుతున్నారన్న అక్కసుతోనే టోల్ గేట్ల యాజమాన్యాలే ఆయనపై దాడి చేసి ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా అరెస్ట్ కాకపోవడం గమనార్హం.