: స్విట్జర్లాండులో ఢీ కొట్టుకున్న రెండు రైళ్లు


స్విట్జర్లాండులో రెండు రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. అక్కడి రాఫ్జ్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. రైళ్లు ఢీ కొట్టిన విషయం తెలుసుకోగానే హుటాహుటీన పోలీసులు సహాయక బృందాలతో సంఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. శకలాలను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదం ఎలా జరిగింది? దానికి కారణాలు ఏంటి? అనే వాటిపై దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News