: అప్పుడు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టావు... ఇప్పుడు సెటిలర్స్ వెంట పడ్డావు... కేసీఆర్ పై కాంగ్రెస్ విసుర్లు


ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి కోట్లు దండుకున్న కేసీఆర్, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం సెటిలర్స్ బాట పట్టారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ను మాట మార్చే నేత, మూఢ నమ్మకాల సీఎం అని ప్రజలే నిరసన తెలుపుతున్నారని, ఆయనో నియంతలా వ్యవహరిస్తున్నారని పొన్నాల నేడు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సెటిలర్స్ వద్దకు కేసీఆర్ వెళుతున్నారని, టీఆర్ఎస్ కేబినెట్ లో సగంమంది తెలంగాణ వ్యతిరేకులేనని మాజీ మంత్రి దానం నాగేందర్ విమర్శించారు. కాంగ్రెస్ క్యాడర్ను వేధిస్తే పోలీస్ స్టేషన్ లను ముట్టడిస్తామని దానం హెచ్చరించారు.

  • Loading...

More Telugu News