: ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లకు స్వైన్ ఫ్లూ... నేషనల్ పోలీసు అకాడెమీలో కలకలం


హైదరాబాదును ప్రాణాంతక స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. హైదరాబాదుకు చుట్టపుచూపుగా వచ్చిన పలువురు ఈ వ్యాధి బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తిరుపతి వెళ్లి వచ్చిన ట్రైనీ ఐపీఎస్ లు ఈ వ్యాధి బారిన పడ్డారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారులకు ఈ వ్యాధి సోకింది. అకాడెమీలోని 12 ట్రైనీ ఐపీఎస్ లకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. వీరిలో ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో అకాడెమీలో కలకలం రేగింది. మరో 13 మంది అధికారులు ఫ్లూ లక్షణాలతో ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం. దీంతో ముందు జాగ్రత్త చర్యల కింద అకాడెమీ అధికారులు ట్రైనీ ఐపీఎస్ లకు వైరల్ మందులతో పాటు ఫేస్ మాస్కులను కూడా అందజేశారు. మొన్నటి తిరుపతి ఉప ఎన్నికల విధుల్లో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత ట్రైనీ ఐపీఎస్ లంతా అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఇంకా 13 మంది ట్రైనీ ఐపీఎస్ ల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారట. వీరి నివేదికలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News